బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

Big shock for BRS..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనున్నదా..?.ఎల్కతుర్తి సభకు బ్రేక్ పడనున్నదా..?. ఇటీవల వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నేతలు సీపీని కల్సి సభకు అనుమతికోసం లేఖ ఇచ్చిన ఇంతవరకూ రిప్లయ్ లేదా..?.
అసలు విషయానికి వస్తే ఇప్పటికే ఆ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల పేరుతో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న సంగతి మనకు తెల్సిందే. అయితే వరంగల్ కమీషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు.
ఈరోజు ఆదివారం నుండి దాదాపు ముప్పై రోజుల నుండి ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఎల్కతుర్తి కమీషనరేట్ పరిధిలోనే ఉండటంతో సభ జరుగుతుందా లేదా..?. మరి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం ఈ ముప్పై రోజులు ఎలాంటి సభలు.. ధర్నాలు రాస్తోరోకులు.. ఊరేగింపులు నిర్వహించకూడదు. మరి ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే వీలు గులాబీ దళానికి ఉంది.
