HCU వివాదంపై స్పందిస్తే తాట తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమి కోసం యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఆకర్శించిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగింది.
అయితే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ , నాటీ హీరోయిన్ రేణూ దేశాయి, హీరో ప్రియదర్శి, విజయ్ దేవరకొండ లాంటి ప్రముఖులు స్పందించి యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి మద్ధతుగా నిలిచారు. ఇదే నచ్చని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరుగాంచిన హైదరాబాద్ కు చెందిన నేత ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న బడా నిర్మాతకు కాల్ చేసి బెదిరించారని ఫిల్మ్ నగర్లో వార్తలు కోడై కూస్తున్నాయి.
సదరు నేత ఆ నిర్మాతకు ఫోన్ చేసి సినిమా వాళ్లకు హెచ్ సీయూ తో ఏమి సంబంధం. మీ పని మీరు చేసుకోకుండా మీకు అనవసరమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు. ఇక్కడితో ఆగండి. లేదు మేము ముందు కెళ్తాం.. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని సదరు నిర్మాతను హెచ్చారించారంట. చేసేది ఏమి లేక ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకేళ్తే కొద్ది కాలం వెయిట్ చేద్దాం. సమయం వచ్చినప్పుడు మాట్లాడుదాం అని సదరు నిర్మాతను ఆ పెద్దలు సముదాయించారని ఫిల్మ్ నగర్ లో అంతా చర్చించుకుంటున్నారు.
