బాలీవుడ్ ఇండస్ట్రీపై రౌడీ ఫెలో సంచలన వ్యాఖ్యలు

 బాలీవుడ్ ఇండస్ట్రీపై రౌడీ ఫెలో సంచలన వ్యాఖ్యలు

Vijay Devarakonda

Loading

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. అతికొద్ది సమయంలోనే ఈ ఇండస్ట్రీ మునుపటి వైభవాన్ని సాధిస్తుంది అని అన్నారు. ఉత్తరాధి సినిమాలు అక్కడ అంతగా ఆడటం లేదు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

దీనివెనక ఎంతోమంది నటుల.. దర్శక నిర్మాతల కృషి ఉంది. ప్రస్తుతం ఉత్తరాధి ప్రేక్షకులు సైతం మన సిని మాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకానోక సమయంలో మన సినిమాలను చూడటానికి ఉత్తరాధి వాళ్లు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. బాలీవుడ్ లో లోటున్న ప్రస్తుత పరిస్థితులను కొత్త దర్శకులు పూడుస్తా రు.అయితే ఇది దక్షిణాది దర్శకులు ఆ లోటును భర్తీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో సరైన సక్సెస్ సాధించిన సినిమాలు ఒకటి రెండు తప్పా ఎక్కువ లేకపో వడం విశేషం. వందల కోట్లతో తీసిన సినిమాలు సైతం ప్లాప్ అవుతుండటం గమనార్హం. బాలీవుడ్ లో నెలకొ న్న పరిస్థితులపై ఆ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు విమర్శలు చేయడం విశేషం. వారి విమర్శలు నిజమే అని అన్నట్లు విజయ్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *