రేషన్ కార్డులపై బిగ్ అలెర్ట్..!

Big alert on ration cards..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈనెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో జరిగిన సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో వీటీని పంపిణీ చేయాలని, ఇందులో స్థానిక మంత్రులు, ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు , కలెక్టర్లు పాల్గొనాలని రేవంత్ రెడ్డి సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సన్నబియ్యం ఇస్తుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు.