భట్టీ విక్రమార్క మల్లు సంచలన నిర్ణయం..!

Deputy CM Bhatti Vikramarka Vatti’s words..!
తెలంగాణ డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టీ.
ఇందులో భాగంగా ఈ వ్యవహారంలో యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహారిం చుకోవాలి. అక్రమ కేసులను పెట్టి సంగారెడ్డి జైలుకి తరలించిన ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి.
వారిపై పెట్టిన కేసులన్నీంటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా యూనివర్సిటీలో బందోబస్తుగా ఉన్న పోలీసులను వెనక్కి పంపించాలి. యూనివర్సిటీలో ఎలాంటి గొడవలు .. సమస్యలు జరకుండా చూస్కోవాలి. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలకుండా చర్యలు తీసుకోవాలని వీసీకి భట్టీ విక్రమార్క మల్లు లేఖ రాశారు.


