సింగరేణి అధికారులతో భట్టీ భేటీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సింగరేణి అధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి గురించి సుధీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చలో భాగంగా నైనీ బ్లాక్ నుండి నాలుగు నెలల్లోనే బొగ్గును ఉత్పత్తి చేయాలి.. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ విధానంలో పరిహారం అందించాలి.. అవసరమైతే ఆ రాష్ట్ర అధికారులను సంప్రదించి హైటెన్షన్ కరెంటు స్థంభాలను అక్కడ వేయించాలి..
నైనీ బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా ఓ జనరల్ మేనేజర్ ను అక్కడకి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో నైనీ బ్లాక్ నుండి త్వరగా బొగ్గు ఉత్పత్తిని మొదలెట్టాలి అని అధికారులను ఆదేశించారు భట్టి.