ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే..!

ప్రతి రోజూ లేవగానే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేడి నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి.
తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. శరీరం బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై ముడతలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
