హక్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యం-గొంతెత్తిన 39 మంది సస్పెండ్..?
తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ పోలీసులు తమ హక్కుల కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ కేంద్రాల దగ్గర ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తూ పోరాడుతున్న సంగతి తెల్సిందే. ముందుగా బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఎందుకంటే యూనిఫామ్ ఉద్యోగులు ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేయకూడదనే నియమనిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో వారు రంగంలోకి దిగి తమ వారి తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నిరసనల్లో భాగంగా ప్రభుత్వం .. పోలీసులు తమ కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ఏదైతే అది అవుతుందని ఏకంగా బెటాలియన్ కానిస్టేబుల్స్ ధర్నాలకు.. రాస్తోరోకులకు దిగారు..బైకు ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం వారిపై శాఖ పరమైన చర్యలకు ఉపక్రమించింది. ఒక్కర్ని కాదు ఇద్దర్ని కాదు ఏకంగా ముప్పై తొమ్మిదిని మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీటిపై నెటిజన్లు, బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
గత ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం తప్పా..?. అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తున్న చేయకపోవడంతో నిరసన తెలపడం తప్పా..?. మేము చేసింది తప్పు అయితే మీరు చేసింది ఏంటి.?. హక్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యమా..?. అలాంటప్పుడు మా హక్కులను నెరవేర్చామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్ధతుగా నెటిజన్లు నిలుస్తూ పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.