KCR ను వదలని బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కల్సి ఖమ్మం వరద ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు.
అనంతర బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.1384కోట్లను ఖర్చు చేయలేదు. కనీసం సింగిల్ పైసా కూడా అప్పటి బాధితుల కోసం వినియోగించలేదు. కేంద్రం డబ్బులను ప్రాజెక్టుల పేరుతో… నిర్మాణాల పేరుతో కొల్లగొట్టారు తప్పా ప్రజలకు లాభం చేకూర్చలేదు అని అరోపించారు.
అక్కడితో ఆగకుండా సచివాలయాన్ని పరిశీలించిన బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన రెండు రోజుల్లోనే సచివాలయంపై ఉన్న డూమ్ లను కూల్చివేస్తాము. పదేండ్లు నియంతలా కేసీఆర్ పాలించాడు. అందుకే ప్రజలు ఫామ్ హౌజ్ లో కూర్చోబెట్టారు అని విరుచుకుపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై నెటిజన్లు అధికారంలో ఉన్న కేసీఆర్నే తిట్టాలి.. ప్రతిపక్షంలో ఉన్న కేసీఅర్నే తిట్టాలి..
ఎంపీగా ఉన్న అట్నే ఉన్నాడు.. కేంద్ర మంత్రిగా ఉన్న అదే తీరుతో ముందుకెళ్తున్నాడు . కేసీఆర్ ను ఎప్పటికి వదలడా అని ట్రోల్స్ చేస్తున్నారు. వరద సమయంలో బాధితులకు అండగా ఉండాల్సింది పోయి గత ప్రభుత్వం చేయలేదు.. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంత సాయం అందిస్తారో చెప్పాలి కానీ ఈ బురద మాటలెందుకు బండి అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.