రేవంత్ రెడ్డి ఆటలో అరటిపండు తీన్మార్ మల్లన్న!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే అఖరీ రెడ్డి ముఖ్యమంత్రి కావోచ్చు.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మాత్రం వెనకంజ వేయకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశాము..
రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో సైతం అవకాశాలు పెరగనున్నాయి. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే కులగణన ప్రక్రియను ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేశాము అని అన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గతంలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పలుమార్లు బీసీ వ్యక్తే రాబోయే రోజుల్లో సీఎం అవుతారు.
రేవంత్ రెడ్డే అఖరీ రెడ్డి సీఎం అని చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా తెలంగాణ పాలిటిక్స్ లో గుర్తు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో అగ్రకులాల ఆధిపత్యానికి చెక్ పడటం ఖాయం. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రి అవుతారనే వార్తలకు.. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి అని వారు విశ్లేషిస్తున్నారు.
తీన్మార్ మల్లన్న పలుసార్లు ఇటు కాంగ్రెస్ పార్టీని.. అటు రెడ్డీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం.. అవమానకరంగా ప్రవర్తించిన కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణం ఇదే.. రేవంత్ రెడ్డి ఆడిస్తున ఆటలో తీన్మార్ మల్లన్న అరటిపండు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
