అల్లు అర్జున్ కి బెయిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే..
ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం బన్నీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.