మదనపల్లె ఘటనపై బాబు సమీక్ష

 మదనపల్లె ఘటనపై బాబు సమీక్ష

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు ..

అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు  అధికారులు వివరించారు .అయితే ఈ  ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు ..

నిన్న రాత్రి 10.30 వరకు ఆఫీస్‌లోనే ఉద్యోగి గౌతమ్ తేజ ఉన్నట్లు గుర్తించారు .. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసులో ఉండడంపై  ఆరా తీశారు . గౌతమ్‌ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *