మారిన బాబు …మార్పు మంచిదేనంటున్న తమ్ముళ్లు..
ఏపీ మంత్రి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హారిత ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే… ఆ వీడియోలో మంత్రి సతీమణి హారిత మాట్లాడుతూ ‘తెల్లవారిందా? ప్రభుత్వమే కదా జీతం చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. కాన్వాయ్ స్టార్ట్ చేయండి’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు మంత్రితో ఫోన్ లో మాట్లాడి వివరణ కోరారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని బాబు హెచ్చరించారు.