ముస్లీం సోదరులకు బాబు బక్రీద్ శుభాకాంక్షలు
ఏపీలో ఉన్న ముస్లీం సోదరులకు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. రేపు బక్రీద్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు.
“అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.
త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని ముఖ్యమంత్రి మైనార్టీ సోదరులకు పిలుపునిచ్చారు.