ఆసీస్ ఆలౌట్ .. కష్టాల్లో టీమిండియా..!
బోర్డర్ గవాస్కర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ ఆలౌటైంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే రెండో ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు తన చివరి వికెట్ ను కోల్పోయింది. భారత్ ఫేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసీస్ బ్యాట్స్ మెన్ లయన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 234పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైంది.
మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్ మూడు.. జడేజా ఒక వికెట్ ను తీశారు. మరోవైపు మూడోందల నలబై పరుగుల లక్ష్య చేధనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలో హాంసపాదు ఎదురైంది. ఒకే ఓవర్లో కమిన్స్ రెండు వికెట్లను తీశాడు.
ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న పదిహేడో ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సైతం అదే ఓవర్లో అఖరి బంతికి డకౌట్ అయి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (12)పరుగులతో ఉన్నారు. మరోవైపు కేవలం ఐదు పరుగులకే విరాట్ కోహ్లీ కూడా ఔటయ్యాడు. దీంతో లంచ్ విరామానికి మూడు వికెట్లను కోల్పోయి ముప్పై మూడు పరుగులు చేసింది.