ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఓ బూటకం : బీఆర్ఎస్ నేత క్రిషాంక్.!

Manne Krishank
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై ఓయూ పరిధిలో మాణికేశ్వర్ నగర్ లో గుర్తు తెలియని ముప్పై మంది దుండగులు పది బైకులపై వచ్చి దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడి గురించి ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పీఎస్ లో పిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఓ బూటకం అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె క్రిషాంక్ ఆరోపించారు. మీడియాతో మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ ‘ సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీ గణేష్ పై కొంతమంది ఆగంతకులు దాడికి యత్నించడం ఓ నాటకం లా అన్పిస్తుందని’ ఆయన అన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేకి సొంత ప్రభుత్వంలోనే రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. దాడి ఘటనపై ఇటు ఎమ్మెల్యే, అటు పోలీసు అధికారులు భిన్నకోణాల్లో వివరించడం చూస్తుంటే ఇదేదో కట్టు కథలాగే ఉందని క్రిషాంక్ ఆరోపించారు.