జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి
janasena
![]()
ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ చేయించి వివరాలు సేకరించాలి..
దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.. దాడి ఘటనను తెలుసుకున్న జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.. ఈ దాడి ఘటనపై ఎమ్మెల్యే బాలరాజు స్పందిస్తూ తాను సేఫ్ గానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందవద్దు అని తెలిపారు.