బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై దాడి..!

 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై దాడి..!

BRS’ sensational decision on the HCU land dispute..!

Loading

నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే  తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే.

అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నేతలు.. కార్యకర్తలు తొలగించే ప్రయత్నం చేశారు. వీటిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిపై దాడికి దిగారు.

ఇదేమి పని అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పూల కుండీలు విసురుతూ దాడికి యత్నించారు.ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యేఎ భూపాల్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఉండటం విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *