అప్పులతో ఆస్తులు పెంచాము
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది.. దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రజలపై ఉంచింది అని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏదేశమైన అభివృద్ధి కావాలంటే అప్పులు చేయాల్సిందే.తొంబై వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థలో పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచాము..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సబ్ స్టేషన్లు, ట్రాన్సఫార్మర్ల సంఖ్యను పెంచాము.. క్షణం పాటు కూడా పోకుండా కరెంటును సరఫరా చేశాము.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపాము” అని అన్నారు.