వీరేంద్ర సెహ్వాగ్ కి తగ్గ తనయుడు ఆర్యవీర్!

Virender Sehwag son Aaryavir Sehwag
టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే ఆయన తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా మేఘాలయ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున అద్భుతమైన డబుల్ సెంచురీ చేశారు.
మొత్తం 229బంతుల్లో నే అజేయ ద్విశతకం బాదేశాడు. ఇందులో 34ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో మేఘాలయ 260పరుగులకు ఆలౌటైంది.
మరోవైపు ఆర్యవీర్ విజృంభణతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 468పరుగులు చేసింది.
