అరికెలపూడి గాంధీ అడ్రస్ మిస్సింగ్…!

Arekapudi Gandhi
ఆయన నాలుగు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే.. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. అయితేనేమి తన సొంత నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నడిబొడ్డున ఓ సమస్య ఉంటే దాని గురించి మాట్లాడటం కాదు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
శేరిలింగం పల్లి గల్లీ నుండి దేశ రాజధాని ఢిల్లీని దాటి ప్రపంచానికి తెల్సిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అరికెలపూడి గాంధీ మాట కనీసం మీడియా ప్రకటన కూడా విడుదల చేయలేదు. యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ లు చేస్తున్నా.. ఆడబిడ్డలని చూడకుండా వాళ్ళ బట్టలు ఊడదీసి .. జుట్టు పట్టి కిందపడేసి లాగిన కనీసం స్పందన లేదు.
పైకి నేను పార్టీ మారలేదని చెప్తాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటాడు. కానీ తన నియోజకవర్గంలో సమస్య ఉంటే అటువైపు చూడకపోవడంపై స్థానిక ప్రజలతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు తమ ఎమ్మెల్యే కన్పించడం లేదు. అడ్రస్ మిస్సింగ్ .. ఎవరైన ఆచూకీ చెప్తారంటూ విమర్శలు చేస్తున్నారు. ఓట్లప్పుడు కన్పించిన ఎమ్మెల్యే సమస్య వచ్చినప్పుడు కన్పించకపోవడం దారుణం. వచ్చేన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
