అతిగా నిద్ర పోతున్నారా..?

Are you sleeping too much?
మాములుగా మనం కంటికి సరిపడా నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తే, అతి నిద్ర పలు రోగాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిరోజూ 8-9 గంటల కంటే ఎక్కువగా పడుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయానికి దారి తీయడంతో పాటు గుండెజబ్బులు వస్తాయి.
ఒత్తిడికి లోనై చిన్నచిన్న విషయాలకూ కోపం వస్తుంది. తల, వెన్నునొప్పి, కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఈ మార్పులు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి.
