టిఫెన్ లో ఇవి తింటున్నారా..?. లేదా..?
సహాజంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా రెండు గంటల్లో బ్రేక్ పాస్ట్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ టిఫెన్ ఎక్కువగానే తినవచ్చు. కానీ మన బిజీ బిజీ జీవితంలో మార్నింగ్ చాలా మంది టిఫెన్ తినడం స్క్రిప్ చేస్తారు. ఆఫీసుకు ఆలస్యమవుతుందనో… బద్ధకంగా ఉండో ఎక్కువ మంది బ్రేక్ పాస్ట్ ను అవైడ్ చేస్తారు.
కానీ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండి రోజంతా పనులు బాగా చేస్కోవచ్చు. దీంతో మనకు ఎలాంటీ సమస్య ఉండదు. బ్రేక్ పాస్ట్ లో గుడ్లు, పెరుగు, పన్నీరు, సాల్మన్ వంటి ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని బ్రేక్ పాస్ట్ గా తీసుకోవాలి. దీని వల్ల మన శరీరం ఆరోగ్యంగా.. మరింత యాక్టివ్ గా ఉంటుంది.
అలాగే అల్పాహారంలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ జ్యూస్ , వైట్ బ్రెడ్ , జంక్ పుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు.. మాంసం , సమోసా, పకోడి ,పూరీ వంటివి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ గా తీసుకోకూడదు.