కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా వాళ్ళే దిక్కా…?

Are they the direction of the Congress government?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి.గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి.ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు.తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం.
మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అయితే ఏడాదిగా తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలపై సినీ నటులు అందరూ ప్రచారం కల్పించాలి.. రాష్ట్రాభివృద్ధి పాలుపంచుకోవాలి.వచ్చే నాలుగేళ్ళు మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి. అండగా ఉండాలి అని కోరినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కాంగ్రెస్ సర్కారుకు సినిమా వాళ్ళే దిక్కా అని నెగిటీవ్ కామెంట్స్ సైతం అదే ఫిల్మ్ నగర్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
