మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్

Lokesh as Deputy CM..!
ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు..
దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.. కొంతమంది అత్యుత్సాహ అధికారుల వల్ల మీరు అరెస్ట్ అయ్యారు.. దీనికి సంబంధించి నన్ను మా ప్రభుత్వాన్ని క్షమించాలి.
ఇంకా అయన పరదాల ప్రభుత్వం పోయిన కొంతమంది అదే ప్రభుత్వంలో ఉన్నట్లు ఉన్నారు.. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావు.. ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ 100 ఉన్నంతధికారులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్ …
