ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనరసింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం రాజధాని మహానగరం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు బుధవారం జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ ఆధిష్టానంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి.
మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ కు వెళ్లకున్నారు. ఈ నెల పంతోమ్మిదో తారీఖు వరకు అక్కడే ఉండనున్నారు. ఆ తర్వాత ఇరవై తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు వరకు దావోస్ లోనే పర్యటించనున్నారు.