విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు
ఏపీలో వరదలతో అతలాకుతలమైన నగరం విజయవాడ.. గల్లీ నుండి జాతీయ రహదారి వరకు.. సీసీ రోడ్ల నుండి రైల్వే ట్రాక్ వరకు.. గుడిసె నుండి బంగ్లాల వరకు అన్ని ఈ వరదలకు తీవ్రంగా నష్టపోయాయి.. ప్రాణ నష్టం నుండి బయటపడిన కానీ ఆర్థికంగా మాత్రం చాలా నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదించారు.
రెండు మూడురోజులుగా ప్రజల మధ్యనే ఉంటూ వారికందుతున్న సేవలు.. చేస్తున్న సహాయక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేశారు. తాజాగా విజయవాడకు మరో ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.. ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలున్న నేపథ్యంలో బుడమేరుకు నిన్న ఒక్కరోజే వెయ్యి క్యూసెక్కుల వరద ప్రవాహాం వచ్చింది.
ఈ ఒక్కరోజే దాదాపుగా ఎనిమిది వేల క్యూసెక్కుల ప్రవాహాం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా పరిసర ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాగుకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ఒక గండిని ఇప్పటికే పూడ్చారు. మిగతా రెండు గండ్లిని పూడ్చే ప్రక్రియను మంత్రి నారా లోకేశ్ నాయుడు మంత్రి నిమ్మల రామానాయుడుకి అప్పగించారు. అయితే పైనుండి వరదలు ఎక్కువగా ఉండటంతో పూడిక పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.