ఢిల్లీ కి కొత్త సీఎం ప్రకటన

New CM OF Delhi
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విధితమే. ప్రకటించిన విధంగానే ఈరోజు మంగళవారం ఆప్ ఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు.
దాదాపు రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ ను తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లేజిస్లేటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈరోజు సాయంత్రం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. రాజీనామా చేసిన లేఖను లెప్టినెంట్ గవర్నర్ కు అందజేస్తాను అని ఆయన తెలిపారు.