రైతు భరోసా పై అంక్షలా..!
Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.
రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది.
రైతులు కాదు ప్రభుత్వమే వాళ్లకు ప్రమాన పత్రాన్ని ఇవ్వాలి. కేసీఆర్ గారు గతంలో పన్నెండు సార్లు రైతుబంధు డబ్బులిచ్చారు . ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు ఎందుకు.?. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రభుత్వమే అని అన్నారు.