రూ.200000లు ఇస్తారా..?..లేదా..?-అంగన్వాడీల ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు బెనిఫిట్స్ కిందరూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం..
అప్పటి నుండి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్‌కు సంబంధించి ఎలాంటి జీవో విడుదల కాలేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.