ఆంధ్రులకు కులాభిమానం ఎక్కువ..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ‘తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రా వాళ్లకు చాలా తేడా ఉంది
. తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్య మో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం కులాల భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు.
ప్రాంతీయ తత్వం అసలు ఉండదు. ఒకే ఒక్క చోట వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే మాకు ఆంధ్రులం అనే భావన వస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.