ఒక్కొక్క ఎమ్మెల్యేకి రూ.15కోట్లు ఆఫర్..!

RMPs and PMPs should not use the word “doctor”.
సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లను బీజేపీ ఆఫర్ చేసింది అని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని మొత్తం డెబ్బై స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే.
రేపు ఎనిమిదో తారీఖు ఆ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఢిల్లీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆప్ ను చీల్చడానికి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు పదిహేను కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందని సంచలన అరోపణలు చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే బీజేపీ తమ ఓటమిని ఒప్పుకున్నట్లైంది . ఇతర రాష్ట్రాల్లో బీజేపీ చేసినట్లుగా ఢిల్లీలోనూ పార్టీలో చీల్చాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ నుండి ఏడుగురు ఆప్ అభ్యర్థులకు ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆయన అన్నారు.
