పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్..!

ambati rambabu counter to pawan kalyan
పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు.
మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియదు.
21 సీట్లు గెలుచుకుని 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటూ మాట్లాడుతున్నాడు. టీడీపీలో టికెట్ దక్కనివారికి జనసేన టికెట్లిచ్చింది. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెందిన మనుషులే. జనసేన నిర్వాహణను చూసేది సైతం సీఎం చంద్రబాబే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది.? అంటూ అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.