సీఎం భార్య పీఏని. నన్ను ఎవడ్రా ఆపేది..!

దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించి ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్తేగచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన ప్రకారం… కొండాపూర్లో సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు.

తర్వాత L&T కంపెనీకి లీజుకివ్వగా, గడువు ముగి శాక సంస్థ 2022లో ఖాళీ చేసింది. నాటి నుంచి ఖాళీగా ఉన్న భూమిలో అనిల్ రెడ్డి, తన అనుచరులతో ప్రవేశించి బోర్డులు పాతారు. భూమిని ఖాళీ చేయాలని అడిగినందుకు అనిల్ రెడ్డి, అతడి అనుచరులు తమపై దాడి చేశా రంటూ స్వర్ణలతారెడ్డి జనవరి 5న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

జనవరి 8న అదే భూమిలో అనిల్ రెడ్డి పేరిట ఉన్న బోర్డును తొలగించి, నర్సింహారెడ్డి పేరుతో కొత్త బోర్డు పాతారు. పోలీసులు వెళ్లినప్పుడు మళ్లీ వస్తామని అక్కడున్న వ్యక్తులు వెళ్లిపోయారంటూ స్వర్ణలతారెడ్డి 8న మరోసారి ఫిర్యాదు చేశారు.