అల్లు శిరీష్ విన్నపం -నిర్మాతలు వింటారా మరి..?
అల్లు శిరీష్ బడ్డీ సినిమా ప్రీ రీలీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ “సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచద్దు..
ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళు 90 కోట్ల మంది ఉంటారు కానీ 3నుండి 4 కోట్ల మంది మాత్రమే హిందీ సినిమాలు చూస్తారు.. కానీ తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు..
అదే తెలుగు సినిమాలను 3 కోట్ల మంది చూస్తారు..అందుకే టికెట్ల ధరలను పెంచి సినిమాలని చూడకుండా చేయకండి.. ధరలు అందుబాటులో ఉంటేనే వాళ్ళు సినిమాలను చూస్తారు.. లేకపోతే చూడరు.. అంతిమంగా నిర్మాతలు నష్టపోతారు.. అందుకే టికెట్ల ధరలు పెంచకండి అని “కోరారు..