అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం..!
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని ఆయన అన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన పోలీసులు బన్నీని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.