అల్లు అర్జున్ జీవితాన్నే మార్చిన స్టార్ దర్శకుడు..?
పుష్ప -2 మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ” తాను నటించిన గంగోత్రి మూవీ తర్వాత ఏడాది వరకు ఏ ఒక్కరూ కూడా తనతో కల్సి పని చేయడానికి ముందుకు రాలేదు.
అలాంటీ క్రిటీకల్ సమయంలో దర్శకుడు సుకుమార్ ఆర్య కథతో తన వద్దకు వచ్చాడు. ఆ కథ నచ్చడంతో తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మీరందరూ చూశారు. ఈ మూవీ తర్వాత నేను మళ్లీ వెనక్కి తిరిగి చూసే అవకాశం.. అవసరం రెండూ లేకుండా పోయిందన్నారు.
తన జీవితాన్ని మార్చిన ఏకైక వ్యక్తి సుకుమార్ అని అల్లు అర్జున్ ఏమోషనల్ తో అన్నారు. అల్లు అర్జున్ హీరోగా పుష్ప కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప -2 వచ్చే నెల డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.