రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ సాయం..!
సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే..
కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు..
ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల నుండి 50 లక్షలు ,సుకుమార్ నుండి 50 లక్షల రూపాయలను మొత్తం 2 కోట్ల రూపాయలను ఎఫ్డీసీ చైర్మెన్ దిల్ రాజు గారికి అందచేయడం జరిగింది అని తెలిపారు..