అల్లు అర్జున్ అరెస్ట్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు శుక్రవారం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది.
ఓ బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన పోలీసులు బన్నీని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు.