వయనాడ్ బాధితులకు అండగా హీరో ధనుష్

Actor Dhanush stands by Wayanad victims
ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన “రాయన్’’ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రముఖ హీరో ధనుష్. తాజాగా మరోసారి హీరో ధనుష్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో.. తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆ మొత్తాన్ని అందజేయనున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఘటన గుండెల్ని కదిలించిందని ఈ సందర్భంగా హీరో ధనుష్ తెలిపారు..