ఏడాదిన్నరైన రేవంత్ కి తప్పని “ఆ కష్టాలు”..!

టీపీసీసీ చీఫ్ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న నాయకుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు తన్నీరు హారీష్ రావు.. కేటీఆర్.. ఎమ్మెల్యేలందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే అన్ని తానై పార్టీని అధికారం వైపు మళ్లించాడు. అలాంటి నేత అయిన ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం లేదు ఇంకా ఎవరూ. ఎవరో అయితే ఏమో అనుకోవచ్చు..
వాళ్ళకు రాజకీయ పరిజ్ఞానం లేదనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలకు చెందినవాళ్లైతే సెటైరికల్ గా అలా మరిచిపోయి విమర్షలు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీకి చెందిన నేతలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోవడమే ఆయనకి ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఆ తర్వాత మీడియా సమావేశంలో అది గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని సంబోధించారు.
అది మరిచిపోకముందే తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. సీఎం సొంత జిల్లాకు చెందిన మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మరిచిపోయి ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు. తాజా ఈ వ్యాఖ్యలతో బయట వాళ్లకే కాదు సొంత పార్టీ నేతలకు సైతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గుర్తించడం ఇష్టం లేదన్నట్లు ఉంది. ఇప్పటికైన రాజకీయ విమర్శలు కాకుండా మంచి పనులు చేసి తన పేరును హోదాను గుర్తుంచుకునేలా వ్యవహారించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ క్రిటీక్స్ సూచిస్తున్నారు.
