కొండా సురేఖ వ్యాఖ్యలపై ఓ స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన

Konda Surekha Minister Of Telangana
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ఆమె ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మంత్రి సాటి మహిళ వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యానించడం బాధాకరం..
ఇలాంటి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం ఓ మహిళగా నాకే అసహ్యమేస్తుంది. తాను ఓ మహిళ అనే సంగతి మరిచినట్లున్నారు. పొలిటీకల్ మైలేజీ కోసం నా పేరును కూడా ఉపయోగిస్తున్నారు. ఇకపై దాన్ని మానేయమని నేను కోరుతున్నాను.
నేను పూర్తిగా పొలిటీకల్ వ్యతిరేకిని. నాకు ఏ రాజకీయ పార్టీ కానీ వ్యక్తితో కానీ సంబంధం లేదు. రాజకీయాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆపేయాలి. కల్పిత కథలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని రకుల్ ప్రీత్ సింగ్ కోరారు.
