సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఈ భూమిలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు. అక్కడ ఉన్న నెమళ్లు, జింకలు, కుందేళ్ళు లాంటి వన్య ప్రాణులను సంహారిస్తున్నారు అని పిర్యాదు చేశారు. దీనికి బదులుగా హెచ్ సీయూ భూములను పరిరక్షిస్తాము.
విద్యార్థుల హక్కులను కాపాడతామని హామీచ్చారు. అనంతరం దాసోజ్ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కోసం హెచ్ సీయూ ను విధ్వంసం చేస్తున్నారు. వందల ఎకరాల్లో ఉన్న అడవులను వన్యప్రాణులను ధ్వంసం చేస్తున్నారు.
వందల నెమళ్లను జింకలను వేటాడుతున్నారు. మరి ఒక జింకను వేటాడినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఐదేండ్ల జైలు శిక్ష పడింది. మరి వందల నెమళ్ల.. జింకలను వేటాడుతున్న రేవంత్ రెడ్డికి ఎన్ని ఏండ్లు జైలు శిక్ష పడాలి. సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.. రేవంత్ రెడ్డికి ఓ చట్టమా అని ప్రశ్నించారు.
