తెలంగాణ నుండే పెద్దఎత్తున ఐఏఎస్ లు రావాలి
తెలంగాణ రాష్ట్రం నుండి ఐఏఎస్ లు పెద్ద ఎత్తున రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహాస్తం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనక బడిన రాష్ట్రాలు బీహార్,రాజస్థాన్ .
అలాంటి రాష్ట్రాల నుండే ఎక్కువ మంది కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు వస్తున్నారు. దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ. నగరం హైదరాబాద్. అలాంటి రాష్ట్రంలో అనేక సదుపాయాలు ఉన్న తరుణంలో ఎక్కువమంది సివిల్స్ ప్రిపేర్ అయి కలెక్టర్లు,ఐపీఎస్ లు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రైల్వే బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఆయా రాష్ట్రాల నుండి ఎక్కువమంది యువత ఉద్యోగాలను సాధిస్తున్నారు. తెలంగాణ నుండి కూడా ఎక్కువ మంది యువత ముందుకు రావాలి. తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి మన రాష్ట్రం నుండి ఉన్నతాధికారులు ఉండాల్సినవసరం ఎంతైన ఉందని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.