ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో పర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు తెలిపారు.
అయితే కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు పర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయడం అసాధ్యం .. తప్పనిసరిగా ప్రతేక్ష విచారణకు హాజరు కావాల్సిందే అని కోర్టు తేల్చి చెప్పింది. రెడ్ కార్పెట్ నోటీసులు జారీ చేసి అరెస్టు చేసి తెలంగాణకు తీసుకురావాలని ఆదేశించింది.
దీంతో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు సిట్ బృందం ఇప్పటికే గుర్తించింది. మరో నిందితుడైన శ్రావణ్ రావు అచూకీ కోసం కూడా వెతుకుతున్నట్లు పోలీసులు కోర్టుకు చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ కు రప్పించి విచారణ చేయనున్నట్లు తెలుస్తుంది.