తెలంగాణలో పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్..!

 తెలంగాణలో పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్..!

Deputy, what is this..!

Loading

తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్ళ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని,పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్ జరిగిందని,రైతులను కాంగ్రెస్ నిలువు దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ ,వ్యవసాయశాక మద్యదళారులు,పెట్టుబడి దారులు, మార్కెట్ అదికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కొనుగోళ్ళ విషయంలో పత్తి రైతులకు అన్యాయం చేసారని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది.

తక్కువ దరకే రైతుల పత్తిని కొనుగోలు చేయడం,రైతు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరణ చేప ట్టకపోవడం లొసుగుగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్ వచ్చిన పత్తిని మద్దతుధర చెల్లించకుండా 5 – 6 వేల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసారు..పత్తి రైతులు నేరుగా సీసీఐ కి అమ్మలేని లొసుగును ఆసరాగా చేసుకుని క్వింటాలుకు 7521/- రూపాయల మద్దతు ధర రావాల్సిన రైతుకు 5 నుండి 6 వేలు రావడంతో రైతులు కుదేలయ్యారు..

ఏడుగురు మార్కెట్ల కార్యదర్శలను ఇటివల సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనం గా చెప్పవచ్చు..
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఈ కుంబకోణం జరిగింది.రైతులను కాంగ్రేస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేసింది.. ముఖ్యమంత్రి,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రకటన చేయాలి.. రైతుల ను మార్కెట్ కార్యదర్శులు మద్యవర్తుల, సీసీఐ అదికారులు తో కలిసి రైతులను మోసం చేసారు.. క్వింటాలుకు 2 వేల రూపాయల దోపిడీ జరిగింది.5 లక్షల టన్నుల పత్తి కొనుగోళ్ళలో అవినీతి జరిగినట్టు అధారాలు భయట కొచ్చిందన్నారు..8.42 లక్షల మంది రైతుల నుంచి 14,921 కోట్ల విలువైఙ 20.15 లక్షల టన్నుల పత్తి సీసీఐ కొనుగోలు చేసింది..

అందులో అధికారంగా ప్రైవేటు వ్యాపారులు విక్రయించింది 3,16 లక్షల టన్నులు కాగా,అనదికారికంగా జనవరి ఆఖరు వరకు సుమారు 8 లక్షల టన్నుల పంటను రైతుల నుండి కొనుగోలు చేసారు..ఇందులో 5 లక్షల టన్నుల వరకు రైతుల నుండి తక్కువ దరకు కొని అక్రమంగా టీఆర్ లు పొందడం ద్వారా సీసీఐకి మద్దతుదరకు అమ్మినట్లు తెలిసింది.. దీని వెనకు పెద్దల హస్తం లేకపోలేదు..ఈ స్థాయిలో అవినీతికి పర్యవేక్షణ లోపమా..? ప్రభుత్వ పెద్దలకే ఇందులో లాభమా ఆలోచించాలి..కాంగ్రేస్ పార్టీ ఏనాడైనా రైతులను మోసం చేసే పార్టీనే..కేసీఆర్ పాలనలో మార్కెట్లో ఏనాడూ ఎలాంటి ఆరోపణలు రాలేదు.

నిత్యం సమీక్షలు,సమావేశాలతో మార్కెటింగ్ వ్యవస్థ అద్బుతంగా పనిచేసింది..కాంగ్రేస్ ప్రభుత్వం రాగానే ఈ రకమైన కుంబకోణానికి పాల్పడింది..ఇప్పటికే వర్షాలతో పత్తి దిగుబడి తగ్గింది.పకృతి వైపరిత్యాల చట్టాన్ని అమలు చేయాల్సిన కాంగ్రేస్ తప్పించుకుంది. ఎకరాకు 10వేల నష్టపరిహారం ఇవ్వాల్సిన అర్హత తెలంగాణ పత్తి రైతులకు ఉంది..చట్ట ప్రకారం రావాల్సిన పరిహారాన్ని కాంగ్రేస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది.గతంలో అత్యధి కంగా వరంగల్ జిల్లాకు నష్టపరిహారాన్ని కేసీఆర్ పాలనలో తీసుకువచ్చాము.

రైతులకు సహాయం చేసాం..కాంగ్రేస్ పాలనలో నష్టపోయిన పత్తి రైతును ఈ కుంబకోణం ద్వారా మరింత నష్టాల్లోకి నెట్టారు..రైతును అనువణువునా మోసం చేసారు..ఈ కుంబకోణంపై సీబీఐ విచారణ జరపాలి.. కాంగ్రేస్ పార్టీకి, ముఖ్యమంత్రి,వ్యవసాయ శాఖమంత్రి కి చిత్తశుద్ది ఉంటే విచారణ జరపాలి..కుమ్మక్కై రైతులను దోపిడీ చేసిన డబ్బును కక్కించాలి,రైతులకు ఆ డబ్బును అందజేసి న్యాయం చేయాలి..దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.సంబందిత అదికారికి రాతపూర్వక పిర్యాదు అందజేస్తామన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *