చెప్పి మరి హిట్ కొట్టిన హీరో

Watch this movie with your ex-girlfriend..!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు తనపై తనకు ఉన్న నమ్మకం మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ‘క’ మూవీ హిట్ అవుతుందని ముందే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు.
దీంతో ప్రీరిలీజ్లో ఆయన మాట్లాడిన వీడియోను తాజాగా ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు, నెటిజన్లు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి హీరోగా ఎదిగిన కిరణు అంతా మెచ్చుకుంటున్నారు. కష్టపడి కసిగా సినిమా తీసి కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యారంటూ వారంతా కామెంట్ చేస్తున్నారు.
