సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్ల కలవరం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్టర్ల సంఘటన కలవరం పెడుతుంది..రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల నిన్న మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు వెలిశాయి.
తాజాగా వీటికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి ను ఉద్దేశించి ‘దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి. అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయి రైఫిల్ రెడ్డి’ అని కొన్ని చోట్ల పెట్టారు ..
మరికొన్ని చోట్ల ‘చెప్పింది కొండంత.. చేసింది రవ్వంత’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.