బంగ్లాదేశ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలను ప్రారంభించారు. అనంతర మోదీ మాట్లాడుతూ ” బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిస్థితులు చాలా బాధాకరం..
త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగోస్తాయనే ఆశాభావం” వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనార్టీల భద్రత గురించి 140కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు ,శాంతి మార్గంలో నడవాలని భారత్ ఎప్పుడు కోరుకుంటుంది అని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరమని పేర్కొన్నారు. మతతత్వ పౌరస్మృతిని తలపించే ప్రస్తుత చట్టాలు వివక్షను చూపుతున్నాయని తెలిపారు.