కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ

kollu ravindhra
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి Kishan Reddy Gangapuram తో ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) ప్రాంతీయ కార్యాలయాలు ఏపీలో ఏర్పాటు చేయాలి..
రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు)లో మైనింగ్ & మినరల్ ప్రాసెసింగ్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశ పెట్టాలని కోరారు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గ్రానైట్ ప్రమోషన్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు క్యాప్టివ్ ఇనుప ముడి ఖనిజం, బొగ్గు గనులను తక్షణమే కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పెట్టుబడుల్ని ఏపీ ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని, ఆఫ్‌షోర్ మైనింగ్ వేలంలో పాల్గొనేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి గారికి వినతి పత్రం అందించి కోరడం జరిగింది.
